మంచు విష్ణు, మంచు మనోజ్ ఈరోజు గొడవ పడటానికి సారథి అనే వ్యక్తి కారణమనే సంగతి తెలిసిందే.మంచు బ్రదర్స్ మధ్యలో ఈ మూడో వ్యక్తి ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
మంచు కుటుంబానికి అత్యంత సన్నిహితులలో సారథి ఒకరు కాగా సొంత మనిషిని మంచు విష్ణు కొట్టడం వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం.మొదట సారథి అనే వ్యక్తి మంచు విష్ణు( Manchu vishnu )కు అనుచరుడిగా ఉన్నారు.
మంచు ఫ్యామిలీకి సంబంధించిన చాలా విషయాలలో అతని ప్రమేయం ఉండేది.మంచు కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా సారథి పేరు సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో కూడా సారథి గురించి మంచి అభిప్రాయమే ఉంది.మోహన్ బాబు సమీప బంధువులలో సారథి( Sarathi ) కూడా ఒకరు కావడం గమనార్హం.
అయితే గత కొంతకాలంగా సారథి మనోజ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.

వేర్వేరు కారణాల వల్ల విష్ణుకు దూరమైన సారథి మనోజ్ కు దగ్గర కావడంతో పాటు మనోజ్ వ్యవహరాలను దగ్గరుండి చూసుకోవడం జరిగింది.అయితే విష్ణు గురించి సారథి అనుచితంగా మాట్లాడాడని విష్ణు మనోజ్( Manchu manoj ) ల మధ్య మనస్పర్ధలు సృష్టించాడని అందుకే విష్ణు సారథిపై దాడి చేశాడని సమాచారం అందుతోంది.మోహన్ బాబు జోక్యంతో విష్ణు వీడియోను మనోజ్ డిలీట్ చేశారు.

మంచు విష్ణు దాడి చేయడంతో సారథికి స్వల్పంగా గాయాలు అయ్యాయని ప్రస్తుతం ఆస్పత్రిలో ఈ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.ఈ గొడవ మంచు విష్ణుకు మైనస్ అయిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మంచు విష్ణు మనోజ్ మధ్య బేదాభిప్రాయాలు తొలగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మోహన్ బాబు పుట్టినరోజు జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ గొడవ జరిగింది.ఈ గొడవ వల్ల విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది.







