వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో మోడీని ఎలాగైనా గద్దె దించాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి విపక్ష పార్టీలు.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు తెరతీస్తున్నాయి.
మోడీని గద్దె దించాలంటే విపక్షాల ఐక్యత అవసరం అంటున్న కాంగ్రెస్.అందుకు తగ్గట్టుగానే విపక్షలను ఏకం చేసే పనిలో నిమగ్నం అయింది.
మరోవైపు మోడీ సర్కార్ ( Modi )పై నిత్యం నిప్పులు చెరిగే బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా విపక్షాల ఐక్యత కోరుకుంటుంది.అటు అరవింద్ కేజృవాల్, బిఆర్‌ఎస్( BRS ) అధినేత కేసిఆర్, ఒరిస్సా ముఖ్యమంతి నితిశ్ కుమార్( Nitish Kumar ) వంటి వాళ్ళు కూడా విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.ఎవరికి వారు విపక్షాల ఐక్యత కోరుకుంటున్నప్పటికి.ఎవరు కలిసి ముందుకు రావడం లేదు.కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బెంగాల్ సిఎం మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ( CM Mamata Banerjee, Arvind Kejriwal ), కేసిఆర్ వంటి వాళ్ళు చెబుతున్నారే తప్పా.
వీరు కూడా కలిసి నడిచేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇటీవల విపక్షల ఐక్యతకు పిలుపునిచ్చిన కేజ్రివాల్ తో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసే సాహసం చేయలేదు.
మరోవైపు కేసిఆర్ కూడా విపక్షాలతో కలిసి పని చేసేందుకు నితిశ్ కుమార్ వంటి వాళ్ళతో బేటీలు జరుపుతున్నప్పటికి కేసిఆర్ కు పూర్తి స్థాయి మద్దతు లభించడం లేదు.

అటు మమతా బెనర్జీ కూడా తాజాగా అఖిలేశ్ యాదవ్, నవిన్ పట్నాయక్( Akhilesh Yadav, Navin Patnaik ) వంటివారితో బేటీ అవుతూ మరో ఫ్రంట్ కు శ్రీకారం చూడుతున్నాట్లు నేషనల్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా బాగానే ఉన్నప్పటికి ఎవరికివారు కూటములు ఏర్పాటుకై సిద్దమౌతున్నవేళ వీరందరికి సారథ్యం వహించే లీడర్ ఎవరనేదే అసలు ప్రశ్న.అయితే ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను గమనిస్తే.
కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసిఆర్ మరియు రాహుల్ గాంధీ.వీరందరు కూడా విపక్షాల లీడర్ షిప్ పైనే కన్నెశారు.
మరి వీరందరిలో మోడీని ఢీ కొట్టే నేతగా విపక్షాలు ఎవరిని ఎన్నుకుంటాయనేది ప్రశ్నార్థకం.మరి వీరిలో ఏమాత్రం ఐక్యత లోపించిన.
అది బిజెపికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.అందుకే ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలపై కమలం పార్టీ ఓ కన్నెసింది.
మరి భవిష్యత్ లో మోడీని ఢీ కొట్టే థర్డ్ ఫ్రంట్ లీడర్ ఎవరో చూడాలి.







