కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడుగా పరిచయమై అనంతరం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ నీల్(Prashanth neel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన డైరెక్షన్లో వచ్చిన కేజిఎఫ్(KGF) సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా అనంతరం ప్రశాంత్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) తోకలిసి సలార్ సినిమా(Salaar Movie) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాపై ఇటు ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక తెలుగు ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా పూర్తి స్టఫ్ ఇస్తుందని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా దాదాపు రెండున్నర గంట పాటు నిడివి ఉంటుందని తెలుస్తోంది.
అయితే హాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఇలాంటి మాస్ యాక్షన్ ఉండదని సమాచారం.సాధారణంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా పాటలు కామెడీ చూడటానికి ఆసక్తి చూపించరు.

ఈ క్రమంలోనే హాలీవుడ్ వెర్షన్ లో మాత్రం కామెడీ, సాంగ్స్ ఈ రెండు ఉండకుండా సినిమాని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.ఇందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పడంతో దాదాపు హాలీవుడ్ వర్షన్ లో అరగంట నిడివి తగ్గుతూ కేవలం రెండు గంటల పాటు మాత్రమే సినిమా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.మరి ఈ నిర్ణయం అయితే హాలీవుడ్ వరకు కరెక్ట్ అనిపిస్తుంది.హాలీవుడ్ ఆడియెన్స్‌కు పాటలు, కామెడీ ట్రాక్ అనేది సెట్ కాదు.సినిమా అంతా ఒకే మూడ్‌లో ఉండాలని కోరుకుంటారు.వారి అభిరుచికి అనుగుణంగానే ప్రశాంత్ ఈ సినిమాలో కీలక మార్పులు చేస్తున్నట్టు సమాచారం.
ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా మాత్రం పక్కా కమర్షియల్ మీటర్‌లో ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్(Shruthi Hassan) మొదటి సారి జతకట్టారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.







