ఆయన స్థాయికి నేను చేరుకోలేను.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార సినిమాతో సక్సెస్ సాధించగా ఆ మూవీ సక్సెస్ ఇచ్చిన ఆనందం అమిగోస్ మూవీతో ఆవిరైంది.కళ్యాణ్ రామ్ అమిగోస్( Amigos ) మూవీలో మూడు పాత్రలలో నటించగా ఆ మూడు పాత్రలు బాగానే ఉన్నా ప్రేక్షకులను మాత్రం కళ్యాణ్ రామ్ మెప్పించలేకపోయారు.

 Kalyan Ram Shocking Comments About Senior Ntr Details Here Goes Viral ,kalya-TeluguStop.com

అయితే తాజాగా ఒక సందర్భంలో కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

సీనియర్ ఎన్టీఆర్( N.T.Rama Rao ) తో తనను పోల్చవద్దని తాను అంత పెద్దవాన్ని కాదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ స్థాయిని నేను చేరుకోలేనని కళ్యాణ్ రామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం నిన్న జరగగా చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడమీ ఇందుకు వేదికైంది.

ఈ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాలు ఆకట్టుకుంటున్నాయి.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా( Devil )లో నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో అభిషేక్ నామా నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుండగా కళ్యాణ్ రామ్ మార్కెట్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించే ఆలోచన అయితే ఉందని అయితే చెప్పుకొచ్చారు.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి.కళ్యాణ్ రామ్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube