చంకీల అంగీలేసి అంటూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేసిన నజ్రియా, నాని సతీమణి.. వీడియో వైరల్!

నాచురల్ స్టార్ నాని ( Nani ) మహానటి కీర్తి సురేష్( Keerthy suresh ) జంటగా నటిస్తున్న చిత్రం దసరా(Dasara). ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Nazriya Nani Wife Anjana Gave An Amazing Performance To Chunkyla Angilesi Song V-TeluguStop.com

శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా నుంచిఇప్పటికే విడుదల చేసినటువంటి పాటలు పోస్టర్స్ ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాలోని చంకీల అంగీలేసి అంటూ సాగిపోయే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.ఈ పాట ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని భార్య అంజన(Anuana) నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) సైతం ఈ పాటకు రీల్స్ చేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

నానితో కలిసి నజ్రియా అంటే సుందరానికి(Ante Sundaraniki) సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలో ఈమెకు నాని సతీమణి అంజనతో మంచి పరిచయం ఏర్పడింది.అప్పట్లో కూడా వీరిద్దరూ కలిసి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున డాన్స్ చేశారు.

అయితే తాజాగా దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరిగి అంజన, నజ్రియా ఇద్దరు కూడా ఈ పాటకు పర్ఫామెన్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube