నాని దసరాకి హైప్ క్రియేట్‌ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు

నాచురల్ స్టార్ నాని దసరా సినిమా తో మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.కీర్తి సురేష్( Keerthy suresh ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో వారు మినహా పెద్ద స్టార్స్‌ నటించలేదు, అయినా కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొత్తం తనపై వేసుకుని నాని ముందుకు సాగుతున్నాడు.

 Nani Keerthy Suresh Dasara Movie Promotions Details, Dsara Movie, Keerthy Suresh-TeluguStop.com

శ్రీకాంత్ ఓదెల దర్శకుడి గా మొదటి ప్రయత్నం దసరా సినిమాను చేశాడు.మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది అనేది అందరిలో ఆసక్తిస్తోంది.

కేవలం నాని మరియు కీర్తి సురేష్ లను చూసి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకి రావాల్సి ఉంది.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు కానీ ఇతర భాషల్లో హైప్‌ క్రియేట్ చేసేందుకు నాని తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.మీడియా ఇంట్రాక్షన్ కార్యక్రమాలు నిర్వహించాడు.

ఇతర భాషల్లో రియాల్టీ షో లు ఇంకా పలు కార్యక్రమాల్లో కూడా నాని పాల్గొన్నాడు.మొత్తానికి దసరా సినిమా కి ( Dasara movie ) కొన్ని భాషల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్ చేయడంలో నాని ( Nani ) సక్సెస్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే హిందీ లో ఈ సినిమా కి వచ్చే ఓపెనింగ్స్ ని బట్టి లాంగ్ రన్ కలెక్షన్స్ ఉంటాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.

అందుకే సినిమా ను ఎక్కువగా ప్రమోట్ చేసి మినిమం ఓపెనింగ్ కలెక్షన్స్‌ వచ్చేలా చూసి సినిమా కు వచ్చే పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్స్ నమోదు చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్ చేశారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే కేవలం హిందీ వర్షన్ నుండే 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ సభ్యులు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆ స్థాయిలో బాలీవుడ్ నుండి దసరా చిత్రం కలెక్షన్స్ ని రాబట్టగలదా అనేది చూడాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube