సీఎం కేసీఆర్ తో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాదాపు 3 సార్లు ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.నిన్న కూడా ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో కవిత విచారణకు హాజరయ్యారు.

 Mlc Kavitha Meeting With Cm Kcr Delhi Liquor Scam, Mlc Kavitha, Cm Kcr, Ts Polit-TeluguStop.com

దాదాపు 10 గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించడం జరిగింది.చివరి నిమిషంలో కవిత లీగల్ టీంనీ ఈడీ అధికారులు రమ్మనడం సంచలనం సృష్టించింది.

కానీ విచారణ అనంతరం ఆమె చిరునవ్వుతో ఈడీ కార్యాలయం నుండి కారులో విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చారు.ఈ అంశం మీద ముందుకి వెళుతూ నేడు సీఎం కేసీఆర్ తో కవిత భేటీ కావడం జరిగింది.

ఈ భేటీలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలను…ఈడీ అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకురావడం జరిగిందంట.ఇదే సమయంలో ఈ నెల 24న సుప్రీంకోర్టులో వాదనలు ఎలా ఉండాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారట.దీనిలో భాగంగా రాజకీయంగా బిజెపిని న్యాయపరంగా దర్యాప్తు సంస్థలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై… ఎమ్మెల్సీ కవితకి… కేసీఆర్ పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube