ఈ సింహం, సింగిల్ డైలాగులే జగన్ కొంప ముంచాయా ?

రాజకీయం అంటే ఎప్పుడు ఏక వ్యక్తి కేంద్రం కాదు.అది ఒక ఉమ్మడి వ్యవస్థ ,అధికారంలో స్థాయి భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ అందర్నీ కలుపుకు వెళ్ళినప్పుడే విజయవకాశాలు ఎక్కువ ఉంటాయి.

 Overconfidence In Jagan Got Damage In Elections, Jagan, Chandrababu , Tdp , Ja-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు అన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకమైనా కూడా ఓపిగ్గా, సహనం తో ఎదురుచూసిన చంద్రబాబు( Chandrababu ) అందర్నీ కలుపుకుని వెళ్ళబట్టే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించగలిగారు.ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అసలు టిడిపి ( TDP )అభ్యర్థులు విజయం సాధ్యపడే కాదు.

వామపక్షాలను మొదటినుంచి కలుపుకొని వచ్చారు కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది.సింగల్ గానే ముందుకు వెళ్దాం అన్నా ఆలోచన చేసుంటే పలితం ఏమయ్యేదో అందరికీ తెలుసు .ఈ కోణంలో జగన్ ఇంకా మారాలి అంటూ ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన ను కలవడానికి , తమ అభిప్రాయం చెప్పడానికి జగన్ సమయం ఇవ్వరని , ఏ నిర్ణయమైనా వ్యక్తి కేంద్రంగానే తీసుకుంటారని ఒకరిద్దరు వ్యక్తులను తన ప్రతినిధులుగా పెట్టుకొని తాను చేయాలనుకున్న పనులను మీడియాకు చెప్పించడం లాంటి పద్దతి జగన్( JAGAN ) ను చాలా మందికి దూరం చేస్తుందని ఈ ప్రవర్తన మార్చుకోకుంటే వచ్చే ఎన్నికలలో నష్టం తప్పదు అంటూ ఇతకు చెబుతున్న….విషయంలో ఆయన తన తండ్రి రాజశేఖరరెడ్డిని మార్గదర్శకంగా తీసుకోవాలంటూ కూడా కొంతమంది సూచిస్తున్నారు.

Telugu Chandrababu, Jagan-Telugu Political News

రాజశేఖర్ రెడ్డి ( Rajasekhar Reddy ) ఎప్పుడు చెరగని చిరునవ్వుతో ఉండేవారని తన దగ్గరికి వచ్చి సహాయం అడిగితే తన రాజకీయ ప్రత్యర్థులు అయినా కూడా అడిగిన సహాయం చేసే వారిని, డబ్బు లేకపోయినా, అదికారం లో లేకపోయినా ఆయన చుట్టూ ఒక కోటరీ ఆయన యోగక్షేమాలను పట్టించుకునేదని వారి సలహాలు సూచనలను కూడా ఆయన అదే స్థాయిలో పట్టించుకోనే వార ని దాని ద్వారా ప్రజా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు ఆయన బేరీజు వేసుకో గలిగె వారని కానీ జగన్ తన చుట్టూ ఒక చట్రం నిర్మించుకొని అందులోనే ఉంటున్నారని ,అందువల్ల ఆయన అసలైన ప్రజాభిప్రాయనికి దూరం అవుతూ సర్వేలపై ఆధారపడుతున్నారని ,ఇది ఇలాగే కొనసాగితే ఆయన పూర్తిగా ప్రజలకు దూరం అవుతారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పటికైనా సింహం సింగిల్ డైలాగులు పక్కనపెట్టి ప్రజలను నాయకులను కలుపుకొని పోకపోతే ఆయన నిజంగానే సింగిల్ గా మిగిలిపోతారేమో అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube