రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం సర్పంచ్ కదిరె రజిత- శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్ చేతుల మీదుగా మంజూరైన వడ్డీ లేని రుణాలను 60 మహిళా సంఘాలకు 14 లక్షల 53 వేలను, ప్రొసీడింగులను అందజేశారు.వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఉల్లి శ్రీనివాస్, పెరుమాండ్ల సతీష్, మాధవరెడ్డి,మాజీ ఎంపీటీసీ పొన్నం బాలకిషన్, సిసి రమణ, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు బైరి జ్యోతి,సి ఎ లు భాగ్యమ్మ, కృష్ణవేణి, రాజమణి, గ్రామ శాఖ అధ్యక్షులు బట్టు రాజు,సెక్రెటరీ మహేందర్, దేవేందర్ రెడ్డి, మహిళ సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.