ఏపీలో కాంగ్రెస్ ( Congress ) పరిస్థితి ఉన్న లేనట్టుగానే ఉంది.తెలంగాణ, ఆంధ్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దుర్భరంగా మారింది.
ఏ ఎన్నికలలోను కనీస ప్రభావం చూపించలేని పరిస్థితి నెలకొంది.అంతేకాదు పెద్దగా పార్టీ కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది.
మరోవైపు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయమే ఉంది.ఈ సమయంలో పార్టీ రాజకీయంగా యాక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.
అవి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఈ మధ్యనే ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్దరాజు( Gidugu Ruddaraju ) నియామకం జరిగింది.
అయన బాధ్యతలు స్వీకరించిన తరువాతైనా పార్టీ యాక్టివ్ అవుతుందా అంటే.ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఇక అసలు విషయానికొస్తే, ఏపీ కాంగ్రెస్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది.
కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చింది.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు ఏఐసిసికి రాసిన లేఖ దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.ఏపీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తు పన్ను చెల్లించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి.రాష్ట్రంలో 9 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గాను 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలని నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది.దీంతో ఈ బాకాయల విషయాన్ని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు ఏఐసిసి ట్రెజరర్ దృష్టికి తీసుకువెళ్లారు.దీనిపై స్పందించిన ఏఐసిసి స్థానికంగానే నిధులు సమకూర్చుకుని బకాయిలు చెల్లించుకోవాలని సూచించింది.

దీంతో పార్టీ సీనియర్లను, సానుభూతిపరులను విరాళాలు కోరుతూ పిసిసి చీఫ్ గిడుగు రద్దరాజు లేఖలు రాశారు.విరాళాలు అందించేవారు ఏ ఖాతాల్లో వేయాలి అనే బ్యాంకు వివరాలు కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.ఈ విధంగా విరాళాలను సేకరించి పార్టీ కార్యాలయాల ఆస్తి పన్నులు చెల్లించేందుకు పిసిసి సిద్ధం కావడం కాంగ్రెస్ దుస్థితిని తెలియజేస్తోంది.ఇప్పటికే ఏఐసీసీ కి రాసిన లేఖలో వివిధ జిల్లాల కార్యాలయాలకు,

పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను స్పష్టంగా పేర్కొంటూ గిడుగు రుద్దరాజు లేఖ రాశారు.వాటి వివరాలు పరిశీలిస్తే.విశాఖపట్నం 30 లక్షలు, కాకినాడ రూ.42,71,277, ఏలూరు రూ.6,29,926, విజయవాడ రూ.41,73,917, గుంటూరు రూ.3,92, 282 , ఒంగోలు రూ.5,31,783, నెల్లూరు రూ.1,51,867, కడప రూ.6 లక్షలు, కర్నూలు రూ.2,94,890.మొత్తం 1.40 కోట్ల కు పైగా పెండింగ్ లో ఉన్న పార్టీ ఆఫీస్ ల ఆస్తిపన్ను వివరాలను లేఖలో గిడుగు రుద్దరాజు పేర్కొన్నారు.







