కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandannaa) ఒకరు.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తరచు అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా రష్మిక ట్విట్టర్(Twitter) వేదికగా ఆన్లైన్ చాట్ చేశారు.
#RushHour హ్యాష్ ట్యాగ్ తో అభిమానులతో ముచ్చటించారు.అభిమాని రష్మిక చెల్లెలు షిమాన్(Shiman) మందాన గురించి అడిగారు.
షిమాన్ ఎలా ఉంది? ఇప్పుడు ఏం చదువుతుంది? ఆమెను నువ్వు మిస్ అవుతున్నావా? అని అడిగారు.

ఇలా అభిమాని తన చెల్లెల గురించి అడగడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం తెలియచేశారు.తాను నా పక్కన లేని ప్రతి నిమిషం నేను నా బేబీని మిస్ అవుతూనే ఉంటాను అంటూ తన చెల్లెలిపై ఉన్నటువంటి ప్రేమను తనని ఈమె ఎంతగా మిస్ అవుతున్నారో తెలియజేశారు.ఇక ప్రస్తుతం

తన చెల్లెలు నాలుగవ తరగతి పూర్తి చేసుకుని, ఐదవ తరగతిలోకి అడుగుపెట్టబోతుందని ప్రస్తుతం తనకు పరీక్షలు జరుగుతున్నాయి,తనకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటూ ఈ సందర్భంగా రష్మిక తన చెల్లెలు గురించి వెల్లడించారు.ఇలా తన చెల్లెలు గురించి రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







