తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ(Manchu Family) ఒకటి.మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో గుర్తింపు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు తన వారసులుగా ఇండస్ట్రీకి విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్నలను పరిచయం చేశారు.ఇలా మీరు కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ నటీనటులుగా గుర్తింపు పొందడానికి కృషి చేస్తున్నారు.

ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన సినీ రాజకీయ జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఇక తన నటించిన సినిమాలకు నంది అవార్డులు(Nandi Awards) రావాల్సి ఉండగా కొందరు ఉద్దేశపూర్వకంగానే తనకు అవార్డులు రాకుండా అడ్డుకున్నారంటూ ఈ సందర్భంగా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.తను నటించిన పెదరాయుడు(Pedarayudu) సినిమాకి నంది అవార్డు రావాల్సి ఉంది.
అయితే అవార్డుల కోసం అప్లై చేయగా కొందరు ఉద్దేశపూర్వకంగా రాకుండా చేశారు.అలా చేసిన వాళ్లు ఎవరో కూడా తనకు తెలుసని మోహన్ బాబు తెలిపారు.

ఇక తన కుమారుడు మనోజ్(Manoj) నటించిన ఝుమ్మంది నాదం సినిమాకి కూడా నంది అవార్డు రావాల్సి ఉంది.అయితే ఈ సినిమాకి కాకుండా మరో ఒక చెత్త సినిమాకి నంది అవార్డును ప్రకటించారని ఈ సందర్భంగా మోహన్ బాబు తెలిపారు.అయినా మంచి నటుడికి అవార్డులతో(Awards) పనిలేదని ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ ప్రేమాభిమానాలే వాళ్లకు పెద్ద అవార్డులు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి మోహన్ బాబుకు అవార్డులు రాకుండా అడ్డుకున్నది ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఈయన చేసిన వ్యాఖ్యలపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.







