వర్క్ స్పేస్ ( Work space )యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ అందించింది.సరికొత్త ఫీచర్లను మార్చి 15 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
తద్వారా యూజర్లకు పని మరింత సులభతరం చేసే సౌలభ్యం కల్పించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence )తో కూడిన ఫీచర్లను వర్క్ స్పేస్‌లో జోడించింది.
దీని వల్ల గూగుల్ డాక్స్, జీమెయిల్, గూగుల్ షీట్‌లు, స్లయిడ్‌లు, గూగుల్ మీట్, చాట్‌తో సహా దాని వర్క్‌స్పేస్ యాప్‌ల కోసం ఈ కొత్త ఏఐ ఫీచర్‌లను పరిచయం చేసింది.కొత్త AI ఫీచర్ల( AI features )తో, వినియోగదారులు తమ Gmailని డ్రాఫ్ట్ చేయగలరు.
అంతేకాకుండా ప్రత్యుత్తరం ఇవ్వగలరు.

గూగుల్ డాక్స్‌లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మనకు స్వయంచాలకంగా తర్వాతి కంటెంట్ కనిపిస్తుంది.దానిని అవసరం అనుకుంటే మనం వినియోగించుకోవచ్చు.లేదా వదిలేయొచ్చు.
ప్రూఫ్‌రీడ్ చేయడం, రీ రైట్ చేయడం వంటివి కూడా ఏఐ ఫీచర్ల సాయంతో చేయొచ్చు.అంతేకాకుండా స్లయిడ్‌లలో ఆటోమేటిక్‌గా ఫొటోలు, ఆడియో, వీడియోలను జోడించవచ్చు.
ఈ నెలలో ఈ కొత్త అనుభవాలను విశ్వసనీయ టెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రారంభిస్తామని గూగుల్ పేర్కొంది.

తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.ఆ తర్వాత కస్టమర్లకు, చిన్న వ్యాపారాలకు, సంస్థలకు మరియు విద్యారంగానికి వాటిని మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచడానికి మెరుగుపరుస్తామని వివవరించింది.ఈ ఫీచర్లను మరిన్ని దేశాలలో, మరిన్ని భాషలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
ఇదే కాకుండా Google తన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కోసం కొత్త “సెర్చ్ కంపానియన్” ఫీచర్‌పై పని చేస్తోంది.గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి వెబ్‌లో సెర్చ్ చేయడానికి ఇది సహాయపడుతుంది.







