రాహుల్ గాంధీ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అసలు ఏం జరుగుతుంది?

కొన్ని రోజులుగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వెర్సస్ మోడి కేంద్రం గా పరిణామాలు జరుగుతున్నాయి.లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పట్ల బిజెపి నేతలు గొడవ చేస్తుంటే అదాని మోడీ మధ్య సంబంధాలపై కాంగ్రెస్ నిలదీస్తుంది .

 What Happens When The Police Surround Rahul Gandhi's House , Rahul Gandhi, Polic-TeluguStop.com

ఈ హడావిడి చాలదన్నట్లు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు వెళ్ళటం దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది .రాహుల్ గాందీ ని అరెస్టు చేయబోతున్నారంటూ ముందు వార్తలు వచ్చాయి.అయితే తాము కొన్ని వివరణలు తీసుకోవడానికి వచ్చామని పోలీసులు స్పష్టం చేశారు… తమ నాయకుడి పై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తుంటే దేశం పరువు విదేశాల్లో తీశారు అంటూ రాహుల్ గాంధీ పై భాజపా విరుచుకుపడుతుంది.ఇటీవల జరిగిన భారత్ జోడోయాత్రలో( BHARATH Jodoyatra ) చేసిన కొన్ని వ్యాఖ్యలపై పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది .ఇటీవల ఒక మీటింగ్లో మాట్లాడిన రాహుల్ గాంధీ భారతదేశంలో భాగంగా తాను శ్రీనగర్లో పర్యటించినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఇంకా తామువేధింపులకు గురవుతున్నామని తనతో చెప్పారని మోడీ ప్రభుత్వం లో స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ విమర్శించారు ఇంతకాలం మౌనంగా ఉన్న పోలీసులు ఇప్పుడు ఆ విషయంలో చర్యలకు ఉపక్రమించారు .

Telugu Hooda, Delhi, London, Rahul Gandhi-Telugu Political News

రాహుల్ గాంధీని కలిసి కలిసిన మహిళలు లిస్ట్ ఇస్తే తాము వారికి న్యాయం చేస్తామంటూ ఇప్పుడు పోలీసులు హడావిడి చేస్తున్నారు.రాహుల్ గాంధీ నుంచి వివరాలు తెలుసుకుని ఆ మహిళలకు న్యాయం చేసే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చామంటూ ప్రత్యేక కమిషనర్ హుడా( Commissioner Hooda ) తెలిపారు.ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తారని తమ అధినేతను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ ఇంటికి భారీగా చేరుకున్న కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు .రాజకీయ యాత్రలో భాగంగా ప్రభుత్వం పై విమర్శలు చేయటం ప్రతిపక్షాలకు సహజంగా ఉండేది మరి చేస్తున్న ప్రతి విమర్శకు ఆధారాలు చూపించాలంటే ప్రజాస్వామ్యంలో కుదిరే పని కూడా కాదు అలాగే ప్రతిప్రక్షాలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది.మరి ఈ పరిణామం ముందు ముందుఎన్ని మలుపులు tతీసుకుంటుందో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube