జమిలి ఎన్నికల పై బాజాపా అందుకే గురిపెట్టిందా? పెద్ద ప్లానె ఇది .

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్నికలు జరిపించాలని గతకొన్ని సంవత్సరాలగా భాజపా ప్రభుత్వం ఆశపడుతుంది.ఇప్పటికే కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు జరిగినా రాష్ట్రాల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో వెనకడుగు వేసింది .

 Why Did Bajpa Target Jamili's Election This Is A Big Plane , Minister Kiran Riju-TeluguStop.com

, అయితే ఈసారి 2024న జరిగే ఎన్నికలలో ఈ ప్రయత్నాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది .పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజీ( Minister Kiran Rijuji ) ప్రకటన ఈ విషయాన్ని బలపరుస్తుంది.కేంద్రం జమిలి ఎన్నికలకు మొగ్గుచూపుతుందని, దీనివల్ల బోలెడంత సమయం ధనం ఆదా అవుతుంది అంటూ ఆయన ప్రకటించారు.అయితే దీనిపై రాష్ట్రాల అంగీకారం తీసుకోవాలని తీసుకోవాలని ,.ఎన్నికల సంఘం సహా వివిధ సంఘాలను సంప్రదించి అంగీకారం పొందాల్సి ఉందని ఆయన తెలిపారు.

Telugu Bajpa, Jamili, Karnataka, Kiran Rijuji, Telangana-Telugu Political News

అయితే దీనిపై భాజపాలు లెక్కలు వేరేగా ఉన్నాయని తెలుస్తుంది.అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రాల్లో అదికారం లోకి రావడం ఈజీ అవుతుందని, ప్రాంతీయ సమస్యలు, ఈక్వేషన్స్ ను పక్కన పెట్టి జాతీయస్థాయి అంశాలపై ప్రచారం చేసుకుని చాలా రాష్ట్రాల్లో విజయం సాధించవచ్చు అని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవలసిన అవసరం ఉండదని భాజపా లెక్కలు వేసుకుంటుంది.అయితే ఈ పద్ధతికి చాలా రాష్ట్రాలు అనుకూలంగా లేవు.

జమిలి ఎన్నికలు భాజపాకి అనుకూలంగా ఉంటాయని , వాటికి ఒప్పుకునేది లేదంటూ ప్రాంతీయ పార్టీలు తిరస్కరిస్తున్నాయి.మతం కార్డుతోను ఇతర అంశాలతోనూ ప్రజల్ని మభ్యపెట్టి తనకు అనుకూలంగా ఉండేలా చక్రం తిప్పడం కోసమే భాజపా ఈ ఎత్తుగడ పన్నుతుందని ప్రాంతీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.

మత కల్లోలాలు, దేశభక్తి అనే అంశాలను ప్రచారం చేసుకుంటూ బాజాపా లబ్ది పొందడానికి చూస్తుందంటూ వాటి ఆరోపణ .ఎలా చూసుకున్నా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి.తెలంగాణ, కర్ణాటక( Telangana, Karnataka ) వంటి రాష్ట్రాల్లో ఈ సంవత్సరంలోనే ఎన్నికలు ఉన్నాయి.జమిలి ఎన్నికలు జరగాలంటే అందుకు ఆయా రాష్ట్రాలు ఒప్పుకోవాలి .ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ జమిలి ఎన్నికల ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లడం అంత సులువుగా కనిపించడం లేదు …… మరి కేంద్రం ఈ విషయం లో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube