హైదరాబాద్ మఖాం మార్చిన సీతారామం బ్యూటీ... టాలీవుడ్ లో సెటిల్ అయినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాలీవుడ్ భామలు అడుగుపెట్టి ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మరాఠీ సీరియల్స్ లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నటువంటి నటి మృణాల్ ఠాకూర్ (Mrunal thakur ) తెలుగులో సీతారామం( Sita raamam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Sitaramam Fame Mrunal Thakur Shifted To Hyderabad,sitaramam, Hyderabad,mrunal T-TeluguStop.com

ఇలా ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన మృణాల్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో మరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా విడుదలై చాలా రోజులైనప్పటికీ ఆచితూచి కథల ఎంపిక విషయంలో అడుగులేస్తున్నటువంటి ఈమె నాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా నటిస్తున్నటువంటి తన 30వ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.అదేవిధంగా నటుడు సూర్య( Suriya ) నటిస్తున్నటువంటి వీర్ సినిమాలో కూడా ఈమె నటించబోతున్నారు.వీరితోపాటు మరికొన్ని సినిమా కథలను కూడా వింటూ ఈమె సౌత్ ఇండస్ట్రీలో బిజీగా మారే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా ఈమెకు వరుసగా సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రానున్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఏకంగా హైదరాబాద్ మాఖాం మార్చినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్, హైదరాబాద్( Hyderabad ) లో ఓ ఇంటిని కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.ఇలా ఈమె హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేయడంతో పూర్తిగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెటిల్ కానున్నారా అందుకే హైదరాబాదులో ఇల్లు కొన్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇక నానితోపాటు ఈమె నటించే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రస్తుతం నాని దసరా( Dasara ) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీ ఉన్నారు.

ఈ సినిమా విడుదలైన అనంతరం తన తదుపరి సినిమాతో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube