Ram Gopal Varma: నా భార్య నన్ను కొట్టేది, గోడకేసి బాదింది.. ఒకసారి నా తండ్రి చూసి :వర్మ

రామ్ గోపాల్ వర్మ…( Ram gopal varma ) ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు గొప్ప దర్శకుడుగా భావించిన వారంతా కూడా ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.వర్మకి సినిమా సెన్స్ పూర్తిగా పోయిందని, కేవలం పబ్లిసిటీ పిచ్చి మాత్రమే పట్టుకుందని, అందుకోసమే అడ్డమైన పనులు చేస్తున్నాడని, చివరికి హీరోయిన్స్ కాళ్లు కూడా నాకుతున్నాడని, ఇది కేవలం వర్మలో తెలివితేటలు బాగా ముదిరిపోవడానికి గల లక్షణంగా చెప్పుకోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 Ram Gopal Varma About His Wife Rathna-TeluguStop.com

ఇంత క్రియేటివిటీ ఉన్న దర్శకుడు ( Director ) ఇలా మారిపోవడానికి కారణాలు ఏమైనా ప్రస్తుతం వర్మ లైన్ లో లేడు కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ టైం గడిపేస్తున్నాడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం.

Telugu Ram Gopal Varma, Rathna, Tollywood, Varma-Movie

రాంగోపాల్ వర్మ పిచ్చి పనులను భరించలేని అతడి భార్య రత్న( Rathna ) అతని నుంచి విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది.వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది.అయితే రత్నకు, రాంగోపాల్ వర్మకు మధ్యలో ఎప్పుడు గొడవలు జరిగేవట.

అతడి పనులను సహించలేని రత్న ఎన్నో సార్లు అరిచి గొడవ పెట్టుకునేదట.ఆమె ఎంత అరిచినా కూడా రాంగోపాల్ వర్మ నిశ్శబ్దంగానే ఉండేవాడు.

కుదిరినంతవరకు భరించేవాడు, లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోయే వాడట.కొన్నిసార్లు ఆమె భారీ నుంచి తప్పించుకోవడానికి ఇంటికి వచ్చినా కూడా ఆమెకు కనబడకుండా ఆ తర్వాత పారిపోయేవాడట.

అలా కొన్ని రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదట.ఎక్కడ ఉన్నాడో అన్న విషయం కూడా ఇంటికి తెలియనిచ్చేవాడు కాదట అలా వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

Telugu Ram Gopal Varma, Rathna, Tollywood, Varma-Movie

ఇక ఒక రోజైతే వర్మ ఇంటికి రాగానే రత్న ఏదో ఒక కారణంతో అతడిని నిలదీసిందట.కానీ ఎప్పటిలాగే మౌనంగా ఉన్న వర్మను చూసి ఆమె కోపం పట్టలేక పోయిందట.అదే కోపంలో అతడి చొక్కా కాలర్ ను పట్టుకొని గట్టిగా ప్రశ్నించిందట.అయినా కూడా ఆయన నిశ్శబ్దంగానే ఉండడంతో గోడకేసి బాధిందట.ఇంత గొడవ జరుగుతుంటే వారి అరుపులు విన్న వర్మ తండ్రి అదే సమయానికి వారిని చూశాడట.భర్తను కొడుతున్న రత్నను చూసి ఆయన మందలించాడట.

ఇలా భార్యాభర్తల మాటలు కాస్త చేతల వరకు వెళ్లాయి.అలా కొట్టుకోవడం ఎక్కువ రోజులు కొనసాగక ముందే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube