ఎంత కామెడీ ( Comedy ) చేసి నవ్విస్తే ఏం లాభం చెప్పండి.సీరియస్ గా ఒక్క పాత్ర చేస్తే జనాలు తిప్పి కొట్టేశారు.
కపిల్ శర్మ( Kapil sharma ) తనదైనా కామెడీతో ప్రతి ఒక్క సెలబ్రిటీని తన స్టూడియోకి రప్పించుకుని పంచులతో ఆద్యంతం ఎపిసోడ్ ని రక్తి కట్టిస్తూ ఉంటాడు.ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేసి మరి నిర్మిస్తున్నారు సదరు షో నిర్మాతలు.
మరి ఇంత రేంజ్ కామెడీని పండిస్తూ ఇంత డబ్బు ఖర్చు చేస్తూ ఒక షోని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న కపిల్ శర్మ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందని చెప్పకనే చెప్పారు జనాలు.దేశం మొత్తం మెచ్చిన కమీడియన్ అయిన కూడా సినిమా తీస్తే మొదటి రోజు రీల్ ఖర్చులు కూడా రాలేదంటే నమ్ముతారా.? కానీ అదే వాస్తవం.
జొమాటో అనే కంపెనీని స్ఫూర్తిగా తీసుకొని జ్విగాటో ( Zwigato movie ) అనే పేరుతో కపిల్ శర్మ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ గా ఒక సినిమా లో నటించాడు.లాక్ డౌన్ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ పడుతున్న కష్టాలను కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశాడు.నిజానికి కథ చాలా బాగుంది కానీ ఎందుకో కపిల్ శర్మని అంత సీరియస్ పాత్రలో జనాలు అంగీకరించలేకపోయారు.
వెరసి మొదటి రోజు 46 లక్షలు, రెండవ రోజు 64 లక్షలు, ఆదివారం మరో 10 లక్షలు ఎక్కువే వచ్చే అవకాశం ఉంది ఇది కపిల్ శర్మ సినిమా కలెక్షన్ల కథ.కపిల్ శర్మకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నా కూడా అందులో 2% కూడా సినిమాకు రాలేదు.సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను సైతం తన షో కి పిలిపించి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తాడు.
అయితే ఈ సినిమా కపిల్ శర్మకు ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు.అసలే బాలీవుడ్ లో సరైన హిట్టు లేక రెండేళ్లు గడిచింది దృశ్యం 2, పఠాన్ సినిమాల విజయాలను బాలీవుడ్ విజయాలుగా ఒప్పుకోవడం కష్టమే ఎందుకంటే దృశ్యం 2 సినిమా సౌత్ మేలవింపు.పైగా బాలీవుడ్ లో పఠాన్ విజయాన్ని ఎందరు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ సైతం ఎంత మంచి సినిమా తీసిన వర్కౌట్ కావడం లేదు.అలాంటిది ఈ కపిల్ శర్మ ఏదో ఊడబడి చేస్తాడని అనుకుంటే పొరపాటే.
కామెడీతో నవ్వించే వాళ్ళు సీరియస్ పాత్ర చేయడం కూడా చాలా కష్టంగానే జనాలు చేత ఒప్పుకోబడతాయి బ్రహ్మానందం లాంటివి స్టార్ కమెడియన్ ఒక సీరియస్ పాత్ర చేస్తే ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి.