బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి హన్సిక (Hansika) ఒకరు.హీరోయిన్ గా ఈమె తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన దేశముదురు (Desamuduru) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హన్సిక అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు హీరోల సరసన నటించారు ఇక తమిళంలో(Tamil) కూడా ఈమె స్టార్ హీరోల సరసన నటించి అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.

ఇలా తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి హన్సిక ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈమె తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లి వేడుక లవ్ షాది డ్రామా(Love Shadi Drama) పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+Hot Star)లో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా లవ్ షాది డ్రామా పేరిట హన్సిక సోహెల్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లి గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

తాజాగా హన్సిక తల్లి తన కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.పెళ్లి వేడుకలలో భాగంగా వరుడు సోహైల్ కుటుంబ సభ్యులు సరైన సమయానికి చేరుకోలేకపోయారట.ఇలా వారు సరైన సమయానికి అక్కడికి రాకపోవడంతో తమకు చాలా టెన్షన్ వేసిందని అయితే తాను సోహైల్ తల్లికి ఫోన్ చేసి ఇంకా మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి ఐదు లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారట.
ఇలా నిమిషానికి ఐదు లక్షలు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులకు చెప్పామంటూ హన్సిక తల్లి ఈ సందర్భంగా చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







