రానా నాయుడు వెబ్ సిరీస్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో వెంటనే ఆ వెబ్ సిరీస్ ను ఓటీటీ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఓటీటీలో వచ్చే కంటెంట్ ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలని విజయశాంతి తెలిపారు.ఓటీటీ సెన్సార్ సమస్యపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
మహిళా వ్యతిరేకత ఎక్కువ కాకముందే నిర్మాతలు వెబ్ సిరీస్ ప్రసారాలను నిలిపేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.