అషురెడ్డి ఎక్స్ ప్రెస్ హరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.కామెడీ స్టార్స్ షో( Comedy Stars Show )లో ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి పేరును టాటూ వేయించుకుని హాట్ టాపిక్ అయ్యారు.
అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ప్రోమో( Aadivaram With Star Maa Parivaar ) రిలీజ్ కాగా ఈ ప్రోమోలో ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ ప్రోమోలో శ్రీముఖి సుగుణ సుందరి సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేశారు.

శ్రీముఖి( Sreemukhi )ఎక్స్ ప్రెస్ హరితో అవినాష్, ఫైమా రాలేదా అని అడగగా రారు.రానివ్వను నెక్స్ట్ అని ఎక్స్ ప్రెస్ హరి కామెంట్ చేశారు.నాలుగు డైలాగ్స్ చెప్పి నాలుగు డ్యాన్స్ లు వేసే వాళ్లకే అంతుంటే స్టేజ్ మీద వాళ్ల పర్ఫామెన్స్ తలరాతలు రాసే రైటర్ ను నాకెంత ఉండాలి అని ఎక్స్ ప్రెస్ హరి( Express Hari ) కామెంట్ చేశారు.యాదమరాజు అతని టీం శ్రీముఖి శ్రీముఖి నువ్వు చిప్పలు కడుగు శ్రీముఖి శ్రీముఖి శ్రీముఖి నువ్వు బాత్ రూంలు కడుగు శ్రీముఖి అంటూ ఆమె పరువు తీసేశారు.
ఆ తర్వాత అషురెడ్డి, ఇనయా సుల్తానా, అరియానా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.శ్రీముఖి హరితో టాటూను మరోసారి చూపించాలని కోరగా ఏదైనా చూడాలని అడగొచ్చని టాటూ మాత్రం వద్దని అషురెడ్డి కామెంట్ చేశారు.
ఎందుకు వద్దని శ్రీముఖి అడగగా నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అషురెడ్డి చెప్పుకొచ్చారు.ఆర్జీవీకి అరియానా, ఇనయా, అషురెడ్డి కాల్ చేయగా వర్మ అషురెడ్డి కాల్ ను మాత్రమే లిఫ్ట్ చేయడం గమనార్హం.

ఆ తర్వాత శ్రీముఖి అషురెడ్డికి ముద్దు పెట్టాలని టాస్క్ ఇవ్వగా ఎక్స్ ప్రెస్ హరి అషు.నేను నీకంటే చిన్నోడిని అయినా ప్రేమకు ఆ తేడా లేదని కామెంట్ చేశారు.ఆ తర్వాత అషురెడ్డి( Ashu Reddy ) చెయ్యి పట్టుకుని ఐలవ్యూ అంటూ హరి ప్రపోజ్ చేశారు.అషురెడ్డి రిజెక్ట్ చేసినట్టు రియాక్ట్ కావడంతో హరి ఏడుస్తాడు.
నేను ఎప్పుడూ నిన్ను దేవతలా చూసుకుంటానంటూ హరి అషురెడ్డితో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







