డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో గందరగోళం...!

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ లబ్ధిదారులు శనివారం ఆందోళనకు దిగారు.అధికార పార్టీ నాయకులు తమ వాళ్లకు ఇళ్లను అమ్ముకున్నారని అసలైన అర్హులకు ఇళ్లను కేటాయించలేదని ఆరోపిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారు.

 Confusion In Allotment Of Double Bedroom , Double Bedroom  , Allotment , Yadadri-TeluguStop.com

ఆందోళనకారులకుభువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్,కౌన్సిలర్ ఈరపాక నరసింహ,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బట్టుపల్లి అనురాధ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమైన అర్హులను పక్కన పెట్టేసి, గులాబీ కార్యకర్తలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రభుత్వం నిరుపేదల కోసం ఇళ్లు నిర్మిస్తే ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేతలు తమ మంది మాగాధులకుడబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.ఇప్పటికన్నా జిల్లా ఉన్నతాధకారులు స్పందించి అర్హులైన నిజమైన లబ్దిదారులకు ఇళ్ళ పంపిణీ చేయాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube