1.కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి

టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం అయిన కేటీఆర్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
2.హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
3.పేపర్ లీకేజీ పై పోరాటం కొనసాగిస్తాం

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు.
4.బండి సంజయ్ వివరణ
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సంజయ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ఈరోజు కమిషన్ విచారణకు ఆయన హాజరై వివరణ ఇచ్చారు.
5.అచ్చెన్న విమర్శలు

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చారో చెప్పమంటే అసెంబ్లీలో టిడిపి( TDP ) శాసనసభ్యులను సస్పెండ్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
6.నారా లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కి ప్రవేశించింది.
7.గవర్నర్ తో బీజేపీ నేతలు భేటీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ తమిళ సై తో భేటీ అయ్యారు.పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు.
8.అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో టిడిపి సభ్యుల నిరసన నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) వారిని ఒకరోజు సస్పెండ్ చేశారు.
9.20 న చలో అసెంబ్లీ
ఏపీలో ప్రతిపక్షాలు నిర్వహించే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు.
10.జగన్ ను కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్సీలు ఈరోజు పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ కలిశారు.ఈ సందర్భంగా వారిని జగన్ అభినందించారు.
11.పేపర్ లీకేజీ ఘటనపై కేటీఆర్ కామెంట్స్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గారి మంత్రి కేటీఆర్( KTR ) స్పందించారు.ఇది ఇద్దరు దుర్మార్గులు చేసిన తప్పుదమంటూ మండిపడ్డారు.
12.భారత్ లో కరోనా

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు
టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ లీకేజ్ కేసులు సీట్ అధికారులు వేగం పెంచారు.నాంపల్లి కోర్టు ఇచ్చిన అనుమతితో చంచల్ గూడ జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను తమ కష్టడిలోకి తీసుకున్నారు.
14.బట్టి విక్రమార్క పాదయాత్ర
పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు బట్టు విక్రమార్క పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది .ఈరోజు దస్నగూడ రైతులతో చర్చించుకుంటూ ఆయన యాత్ర కొనసాగించారు.
15.జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
16.ఈడి విచారణకు వైసీపీ ఎంపీ గైర్హాజరు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు వీడి అధికారులు విచారణకు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారు.
17.మాగుంట రాఘవ కస్టడీ పొడగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడగించారు.
18.కెసిఆర్ తో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ
పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పై చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు.
19.పేపర్ లీకేజీ పై ఈటెల కామెంట్స్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పందించారు.పేపర్ లీకేజీ కావాలని చేశారా యాదృచ్ఛికంగా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,320
.






