సూర్య కుమార్ యాదవ్ 2021 మార్చిలో టీ20 లో ఆరంగ్రేటం చేశాడు.రెండు సంవత్సరాల లో 13 అర్థ సెంచరీలు సాధించాడు.టీ20 లో 1675 పరుగులు చేశాడు.టీ20 లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.2021 జూన్ లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చి 21 మ్యాచ్లలో 19 ఇన్నింగ్స్ ఆడి 433 పరుగులు చేశాడు.వన్డే మ్యాచ్ లలో ఇప్పటివరకు కేవలం రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేసి, టీ20 ఫార్మాట్లో రాణించినంతగా.
వన్డే ఫార్మాట్లలో రాణించలేకపోతున్నాడు.తాజాగా జరిగిన తొలి వన్డేలో మొదటి బంతికే డక్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు.
గత పది వన్డే మ్యాచ్ లలో సూర్య కుమార్ యాదవ్ చేసిన స్కోర్లు వరుసగా 13, 9, 8, 4, 34, 6, 4, 31, 14, 0 చేసి అభిమానులను నిరాశ పరుస్తాడు.\శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఆస్ట్రేలియా తో జరిగే 3 వన్డేల సిరీస్ లో, న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కు అవకాశం వచ్చింది.
అయినా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.ఇక ఈయనతో పాటు అంతర్జాతీయ మ్యాచ్లో అరంగ్రేటం ఇషాన్ కిషన్ పరిస్థితి( Ishan Kishan ) కూడా ఇలాగే ఉంది.
ఇద్దరు కూడా వన్డే ఫార్మాట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు.బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో డబల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత వన్డే ఫార్మాట్లో రాణించలేకపోతున్నాడు.
తొలి వన్డే కు రోహిత్ శర్మ( Rohit Sharma ) దూరం కావడంతో ఇషాన్ కిషన్ కు అవకాశం వచ్చింది.ఇషాన్ కిషన్ కూడా తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.వన్డే ఫార్మాట్లో భారత జట్టులో స్థానం లేకపోయినా ఇతర కారణాల వల్ల వచ్చిన అవకాశాలను, సద్వినియోగం చేసుకో లేకపోవడంతో భవిష్యత్తులో అవకాశాలు రావడం కష్టమే.ఏమైనా ఈ విషయంలో ప్రేక్షకులు నిరాశ చెందారు.