నువ్వు నా ప్రాణం.. బాగా చూసుకోవాలి కదా వైరల్ అవుతున్న మహేష్ తమన్నా కొత్త యాడ్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి నటీనటులు ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మహేష్ బాబు(Mahesh Babu)

 You Are My Life Mahesh Tamannaah New Ad Is Going Viral , Mahesh Babu,trivikram S-TeluguStop.com

ఒకరు ఇప్పటికే ఈయన ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.అలాగే మిల్క్ బ్యూటీ తమన్నా(Thamannaa) కూడా పలు యాడ్స్ ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే తాజాగా వీరిద్దరూ ఒక కొత్త యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఇందులో మహేష్ బాబు తమన్నా మధ్య జరిగే సన్నివేశం చాలా రొమాంటిక్ గా ఉందని చెప్పాలి.

ఇలాంటి సీన్ కనుక ఏదైనా సినిమాల్లో ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదని చెప్పాలి.ఇక ఈ వీడియోలో భాగంగా మహేష్ బాబు ఎండలో తన కార్ క్లీన్ చేస్తూ ఉంటారు.తమన్నా అక్కడికి వెళ్లి ఇంత ఎండలో కారు క్లీన్ చేయడం ఏంటి అని అడగగా మహేష్ బాబు ఇది నా ప్రాణం.

బాగా చూసుకోవాలి కదా అంటు లోపలికి వస్తారు.అయితే మహేష్ బాబు లోపలికి రాగానే తమన్నా ఏసీ ఆన్ చేస్తుంది.ఏసీ ఆన్ చేయగానే మహేష్ బాబు ఒక్కసారిగా కూల్ అవుతారు.అప్పుడు తమన్నా మహేష్ బాబు దగ్గరకు వెళ్లి నువ్వు నా ప్రాణం… నిన్ను బాగా చూసుకోవాలి కదా అనే డైలాగ్ చెబుతుంది.

ఇలా ఈ యాడ్ లో వీరిద్దరూ చాలా రొమాంటిక్ గా కనిపించడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.అయితే వీరిద్దరూ కలిసి లాయిడ్ అనే ఏసీ కంపెనీకి చెందిన యాడ్ లో కలిసి నటించారు.ఈ వీడియోలో భాగంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక తమన్నా సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటించిన మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube