బఠాణి సాగు చేసే ముందు నేలను పరీక్షించి, ఆ నేలకు అనువైన విత్తనాలు ఏవో తెలుసుకోవాలి. బఠాణి( pea ) లో పోషక విలువలు సంపూర్ణంగా ఉండడం వల్ల మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.మొదట స్వల్పకాలిక రకాల విషయానికి వస్తే ఎర్లీబాడ్గర్ విత్తనాలు సాగు చేస్తే గింజలు ముడతర రూపంలో ఉండి పొట్టి రకం దిగుబడి వస్తుంది.60 రోజులకు పంట చేతికి వస్తుంది.మీటియర్ విత్తనాలు నునుపుగా ఉంటాయి.60 రోజులకు పంట చేతికి వస్తుంది.జవహర్ మటర్-4 విత్తనాలు మధ్యస్థంగా ఉండి 60 రోజులలో చేతికి వచ్చి దాదాపు ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
మధ్యకాలిక రకమైన బోర్న్ విల్లీ విత్తనాలు బుతువు మధ్యకాలంలో వేయుటకు అనువైన రకం.85 రోజులకు పంట కూతకు వస్తుంది.దాదాపుగా ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.
జవహర్ మటర్-1 విత్తనాలు అయితే 70 రోజులలో పంట చేతికి వచ్చి ఎకరాకు 45 కింటాల్లో దిగుబడి పొందవచ్చు.ఐ.పి-8 విత్తనాలు మధ్యస్థంగా ఉండి 60 నుండి 65 రోజుల మధ్యలో పంట చేతికి వచ్చి ఎకరాకు దాదాపు 100 కింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

బఠాణి సాగు చేయాలి అనుకునే నేలలో వేసవిలో లోతు దుక్కిలు దున్నుకోవాలి.ఆఖరి దిక్కులో దాదాపు పది టన్నుల పశువుల ఎరువును వేసి పొలాన్ని కలియదున్నాలి.నేలలో ఎత్తు, తగ్గులు లేకుండా పొలాన్ని సదరంగా చదును చేసుకోవాలి.
ఒక ఎకరాకు స్వల్పకాలిక రకాలు అయితే 45 కిలోలు అవసరం.మధ్య మరియు దీర్ఘకాలిక రకాలు అయితే 35 కిలోల విత్తనాలు అవసరం.
మొక్కకు, మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు, వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు విత్తుకోవాలి.ముందుగా కిలో విత్తనాలకు ఒక గ్రామం కార్బం డజిమ్ తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరాకు 20 కిలోల పోటాష్ 25 కిలోల భాస్వరం 8 కిలోల నత్రజని విత్తనాలు నాటే సమయంలో పంటకు అందించాలి.







