తొలి వన్డేను వీక్షిస్తున్న రజనీకాంత్.. ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్..!

ఆస్ట్రేలియా- భారత్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూసి అవాక్కయ్యారు.

 Rajinikanth Watching The First Odi.. Australia All Out For 188 Runs..! , Rajinik-TeluguStop.com

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ), ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోటోలు వైరల్ అవడంతో, ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ఇక టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంటే, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోసం బరిలోకి దిగింది.

భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 188 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఒకపక్క భారీ స్కోరు ఇస్తూ.

మరొకపక్క తొందరగా వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు తట్టుకోలేక వెనుతిరిగారు.

ఇక మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ), షమీ చెరో మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు.ఆసీస్ బ్యాటింగ్ కు వస్తే మిచెల్ మార్ష్ (81) పరుగులు చేశాడు.మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేదు.

సరైన సమయంలో భారత బౌలర్లు కీలకమైన వికెట్లను తీయడంతో ఆస్ట్రేలియా ఎక్కువ స్కోరు నమోదు చేయలేకపోయింది.

189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అతి దారుణంగా బ్యాటింగ్ చేస్తూ ఓటమి దిశగా సాగుతోంది అని చెప్పాలి.7 ఓవర్లకు మూడు కీలక వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది.

ఇషాన్ కిషన్ మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 9 బంతులకు( Virat Kohli ) నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.తర్వాత బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ మొదటి బంతికే వెనుతిరగడంతో భారత్ ఇప్పటికే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube