విదేశీ విద్యార్ధులపై బహిష్కరణ వేటు.. భారతీయుల వివరాలు చెప్పనంటోన్న కెనడా

నకిలీ పత్రాలతో వీసాలు సంపాదించి కెనడాలో అడుగుపెట్టిన విదేశీ విద్యార్ధులు చిక్కుల్లో పడ్డారు.ఇందుకు గాను వారిని దేశం నుంచి బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.

 Canadian Govt Refuses To Disclose Number Of Students Facing Deportation, Border-TeluguStop.com

బాధితుల్లో భారతీయ విద్యార్ధులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ జాబితాలో వున్న భారతీయుల వివరాలను చెప్పేందుకుకెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) నిరాకరిస్తోంది.

అయితే అనధికార సమాచారం ప్రకారం దాదాపు 700 మంది విద్యార్ధులు బహిష్కరణకు గురయ్యే అవకాశం వుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని సీబీఎస్ఏ ధ్రువీకరించడం లేదు.

Telugu Agency, Canadian, Canadianrefuses, Cbsa, Faridkot, Inderjit Singh, Karamj

సీబీఎస్ఏ ప్రతినిధి మరియా లాడౌసర్( Ladouceur ) మాట్లాడుతూ.ఒక వ్యక్తికి చెందిన ఇమ్మిగ్రేషన్ సమాచారం ప్రైవేట్‌గానే వుంచుతామని ఆమె స్పష్టం చేశారు.ఇట్టి వారికి గోప్యతా చట్టం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు.నిర్దిష్టమైన కేసులకు సంబంధించి సీబీఎస్ఏ వివరాలు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చును అనే దానికి కొన్ని కఠినమైన పరిమితులు వున్నాయని మరియా పేర్కొన్నారు.

బహిష్కరణ నోటీసులు అందుకున్న విద్యార్ధుల ఖచ్చితమైన సంఖ్య ఎవరికీ తెలియదని ఆమె వెల్లడించారు.

Telugu Agency, Canadian, Canadianrefuses, Cbsa, Faridkot, Inderjit Singh, Karamj

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఇందర్‌జిత్ సింగ్( Inderjit Singh ) ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.తాను 2019లో స్టడీ వీసాపై కెనడాకు వచ్చినట్లు వెల్లడించారు.తన లాంటి బాధితుల కోసం వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని.

ఈ బృందంలో 70 మంది విద్యార్ధులు వున్నట్లు పేర్కొన్నారు.అయితే 700 మంది విద్యార్ధులకు సంబంధించిన డేటా దొరకడం లేదని ఇందర్‌జిత్ చెప్పారు.

గతేడాది ఏప్రిల్, మే నెలల్లో తమకు నోటీసులు అందాయని ఆయన తెలిపారు.ఫరీద్‌కోట్‌కు చెందిన కరమ్‌జీత్ కౌర్( Karamjeet Kaur ) ఇలా నోటీసులు అందుకున్న తొలి విద్యార్ధి.

అయితే కన్సల్టెంట్స్ ద్వారా కెనడాకు వెళ్లిన విద్యార్ధులే ఎక్కువగా మోసపోయినట్లుగా తెలుస్తోంది.విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుకున్న కన్సల్టెన్సీలు వారిని చివరికి నట్టేట ముంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube