ఇరాన్ సరిహద్దులో మారణ హోమం.. 11 మంది శరణార్థులు దారుణ హత్య!!

ఇరాన్( Iran ) సరిహద్దులో ఆ దేశ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు మారణ హోమం సృష్టించారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 11 మంది అఫ్గాన్‌ శరణార్థులను( Afghan Refugees ) ఇరాన్ సరిహద్దు దళాలు దారుణంగా చంపేశారు.

 Iran Border Forces Fire At Afghan Refugees 11 Died Details, Iranian Border, 11 A-TeluguStop.com

తరువాత ఆ అఫ్గాన్‌ శరణార్థుల డెడ్ బాడీస్‌ను నిమ్రోజ్ బోర్డర్ క్రాసింగ్ వద్ద తాలిబన్లకు అప్పాజెప్పారు.ఈ కౄరత్వాన్ని స్థానిక మీడియా నివేదించింది.

మృతులు అఫ్గాన్‌ నుంచి పారిపోయి సిస్తాన్, బలూచిస్థాన్‌లలో ఇల్లీగల్‌గా చొరబడాలని అనుకున్నారు.దురదృష్టం కొద్ది వారు ఇరాన్ భద్రతా దళాలకు చిక్కారు.

దాంతో వారిని దళాలు అక్కడికక్కడే కాల్చి చంపేశారు.మృతులలో 9 మందికి 20 ఏళ్లు, ఇద్దరికి 18 ఏళ్ల వయస్సు ఉన్నట్లు సమాచారం.ఈ దారుణంపై ఇరు దేశాల అధికారులు స్పందించలేదు.ఇకపోతే నిమ్రూజ్ ప్రావిన్స్‌లో గత ఏడాది కాలంలో 470 మందికి పైగా అఫ్గాన్‌ శరణార్థుల మరణించారు.తాలిబన్లు ఈ మరణాలపై స్పందిస్తూ అనేక సంఘటనలలో వారు మరణించారని తెలిపారు.ఇక ఇరాన్ దేశం గత వారంలో 7,612 మంది అఫ్గాన్‌ శరణార్థులను తరిమికొట్టారు.

2021లో తాలిబన్లు( Talibans ) అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న సమయం నుంచి ఆ దేశ ప్రజలు అక్కడి కఠిన రూల్స్, హింస పాటించలేక ఇరాన్, పాకిస్థాన్‌తో సహా ఇతర పొరుగు దేశాలకు తరలిపోతున్నారు.వీరందరూ అక్రమ మార్గాల ద్వారానే పొరుగు దేశాలలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలో వారు అధికారులకు చిక్కి ఇబ్బందులు పడుతున్నారు.ఒక్కోసారి వారి చేతుల్లో హతం అవుతున్నారు.ఖమా ప్రెస్ ప్రకారం, 3,000 మంది అఫ్గాన్‌ శరణార్థులు మళ్లీ తాలిబన్ల రాజ్యానికే తిరిగి వచ్చినట్లు నివేదించింది.వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది, మరికొందరు తమ ఇష్టానుసారం వెళ్లిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube