మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చారు.మార్చి 12వ తేదీ జరిగిన అంతర్జాతీయ ఆస్కార్ (Oscar) వేడుకలలో భాగంగా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర బృందం పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ వేడుకలు ముగిగానే ముందుగా ఎన్టీఆర్ అమెరికా నుంచి ఇండియా చేరుకున్నారు.ఇక నేడు ఉదయం మిగిలిన చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ (Ramcharan) దంపతులు మాత్రం ఢిల్లీ చేరుకున్నారు.
ఇలా రాంచరణ్ ఉపాసన ఢిల్లీ వెళ్లడానికి కూడా ఓ కారణం ఉంది.17, 18 వ తేదీలలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్ (India today Conclav) కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే ఈయన చిత్ర బృందంతో కలిసి నేరుగా హైదరాబాద్ కాకుండా ఢిల్లీ వెళ్లారు.ఇలా ఢిల్లీకి వెళ్లిన ఈయన నేడు జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లతో కలిసి వేదిక పంచుకోనున్నారు.
ఇలా ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనబోతున్న సందర్భంగా ఈయన నేరుగా ఢిల్లీ వెళ్లారు.ఇలా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాంచరణ్ సందడి చేయగా పెద్ద ఎత్తున మీడియా తనని చుట్టుముట్టారు.అయితే మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని.ఆర్ఆర్ఆర్ ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.కీరవాణి రాజమౌళి చంద్రబోస్ లను చూస్తుంటే ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.
వారి వల్లే తాము రెడ్ కార్పెట్ పై వెళ్లి ఆస్కార్ (Oscar) తీసుకురాగలిగామని ఈ సందర్భంగా చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.