హైదరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
అయినా షాపు నిర్వాహకులు కానీ, భవన యజమానులు పట్టించుకోలేదు.గతంలోనే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే నోటీసులు కూడా ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.భవన యజమాన్యం, షాపుల యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఆరుగురు దుర్మరణం చెందారని తెలుస్తోంది.
కనీస ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని వెల్లడైంది.తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







