మద్యం మత్తులో నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసిన 40 ఏళ్ల కామాంధుడు..!

ఇటీవలే కాలంలో అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.రెండు, మూడు ఏళ్ల చిన్నారుల నుండి 50, 60 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు.

 40 Years Old Man Molested 4 Years Girl In Hyderabad Details, 40 Years Old Man, M-TeluguStop.com

కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు చిన్న పెద్ద తేడా లేకుండా, వావి వరసలు చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు.ఒక రకంగా మనుషుల కంటే క్రూరముగాలే నయం అందిస్తుంది.

జంతువుల కంటే దారుణంగా కొంతమంది దుర్మార్గులు చెలరేగిపోతున్నారు.దీనితో ఇంటిదగ్గర ఒంటరిగా ఉండే మహిళలకు భద్రత అనేది కరువు అవుతొంది.

Telugu Disha, Hyderabad, Migrant Labor, Nirbhaya, Shamshabad, Venkatayya-Latest

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచారాలను అరికట్టేందుకు దిశా, నిర్భయ లాంటి ఎన్నో చట్టాలను రూపొందించి, కఠినంగా శిక్షలు అమలు పరిచిన కూడా కామాందులలో కాస్త కూడా మార్పు కనిపించడం లేదు.ఓ నాలుగేళ్ల చిన్నారిపై( 4 years girl ) 40 ఏళ్లు ఉన్న దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన హైదరాబాదులో ( Hyderabad ) స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య(40)( Venkatayya ) అనే వ్యక్తి కొన్ని రోజులగా శంషాబాద్ లో నివాసం ఉంటూ ప్రైవేట్ లైబ్రరీ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఇదే ప్రాంతంలో కర్ణాటక నుండి వచ్చిన వలస కూలీలు గుడిసెలు వేసుకొని కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు.

Telugu Disha, Hyderabad, Migrant Labor, Nirbhaya, Shamshabad, Venkatayya-Latest

అయితే గుడిసెల పక్కన నివాసం ఉంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై వెంకయ్య కన్నేశాడు.ఆదివారం రాత్రి పీకల దాకా మందు తాగి, ఎవరూ లేని సమయం కోసం వేచి చూసి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.చిన్నారి అరుపులకు తల్లి వచ్చి వెంటనే ఆ కామాంధుల నుండి బిడ్డను కాపాడుతుంది.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ కామాంధుడిపై ఫిర్యాదు చేసింది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.వెంటనే వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు.

అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube