టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే.
దాంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ఇక ఇటీవలే ఉపాసన అన్నట్టుగా చెర్రీకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
చెర్రీ ఆస్కార్ అవార్డు( Oscar Award )ని అందుకోవడంతో మెగా అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.దానికి తోడు రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్న సంతోషం కూడా ఒకటి.
కాగా ప్రస్తుతం ఉపాసన ఆరు నెలల గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అలాగే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ 38వ పుట్టినరోజు వేడుకలు కూడా జరగనున్నాయి.ఇప్పటికే చెర్రీ విషయంలో ఒకదాని తర్వాత ఒకటి సంతోషకరమైన వార్తలు వినిపిస్తుండడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.ఈ జోష్ లోనే రామ్ చరణ్ బర్త్ డే ( Birthday )ని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అభిమానులు చెర్రీ బర్త్డేని ఇప్పటివరకు కనీవినీ ఎరుగని విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా అభిమానులు ఒక క్రేజీ అనౌన్సమెంట్ ని చేశారు.మార్చి 27న చెర్రీ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా ఒక ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయే విధంగా ఉంది.

ఇప్పుడే ఇలా ఉంటే రాంచరణ్ బర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్ ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తారో చూడాలి.అలాగే ఈ నెల 17, 18 న ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించబోయే కాన్ క్లేవ్ లో రాంచరణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లతో కలసి వేదిక పంచుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.రామ్ చరణ్ కి 2023 బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఒకదాని తర్వాత ఒకటి రామ్ చరణ్ కి గుడ్ న్యూస్ లో వినిపిస్తూనే ఉన్నాయి.రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.