ఎన్నారై భర్పూర్ సింగ్( NRI Bharpur Singh ) తాజాగా పంజాబ్ లోని దాదేహర్ సాహిబ్ గ్రామంలోని ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్‌కు వాటర్ కూలర్‌ను ఉచితంగా అందించారు.పాఠశాల హెడ్ గుర్విందర్ సింగ్ బాబు అధ్యక్షతన జరిగిన చిన్న కార్యక్రమంలో కూలర్‌ను ఆయన విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు కూడా పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో జీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అంగ్రేజ్ సింగ్ మాట్లాడుతూ క్లబ్ ఆటగాళ్లకు ఎన్నారై కుటుంబం క్రీడా సామగ్రిని ఎలా విరాళంగా అందజేస్తోందో పంచుకున్నారు.

అంతేకాదు భర్పూర్ సింగ్ కుటుంబం పాఠశాల భవనాన్ని పునర్నిర్మాణానికి కూడా నిధులు సమకూర్చిందన్నారు, ఇది పిల్లలకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడిందని పేర్కొన్నారు.భర్పూర్ సింగ్ విరాళంగా ఇచ్చిన వాటర్ కూలర్( Water Cooler ) వేసవి కాలంలో వేడి తాపం నుంచి విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.భర్పూర్ సింగ్, అతని కుటుంబం చేసిన దాతృత్వ పనులు ప్రశంసనీయం అని స్థానికులు అంటున్నారు.

ఎన్నారైలు ( Nri ) పుట్టిన గడ్డకి ఇలానే సహాయం చేసి తమ రుణాన్ని తీర్చుకోవాలని ఇంకొందరు కోరుతున్నారు.ఇకపోతే భర్పూర్ సింగ్ చేసిన సహాయంతో పాఠశాల, స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. క్రీడా ప్రమాణాలను పెంపొందించడంలో చాలా దోహదపడుతుంది.
ఇకపోతే గతంలో కూడా చాలామంది ఎన్నారైలు లక్షల రూపాయలను డొనేట్ చేసి తాము పుట్టిన ఊర్లను డెవలప్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నారైలు ఎన్నో దాతృత్వ పనులు చేసి తమ మంచి మనసును చాటుకున్నారు.







