స్టార్‌ హీరో సినిమా వాయిదా పడే అవకాశం... వెయ్యి కోట్ల సినిమా తర్వాత ఎందుకు టెన్షన్‌

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ ( Shah Rukh Kha )హీరోగా నటించిన పఠాన్ సినిమా( Pathan movie ) వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.సాధ్యం కాదని భావించిన బాహుబలి 2 రికార్డ్ ను కూడా పఠాన్ బ్రేక్ చేయడం జరిగింది.

 Sharukh Khan Next Movie Jawan Release Update , Sharukh Khan ,movie Jawan,atlee,-TeluguStop.com

షారుఖ్ వెయ్యి కోట్ల సినిమా తర్వాత జవాన్ సినిమా( Jawaan movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.వెయ్యి కోట్లకు పైగా పఠాన్ సినిమా తో రాబట్టిన షారుఖ్ ఖాన్‌ తదుపరి సినిమా జవాన్ కనీసం 500 కోట్ల వసూళ్లు అయినా సాధిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం కోసం దర్శకుడు అట్లీ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు.

జవాన్ సినిమా పై అంచనాలు పెరిగే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం మరియు కాస్త ఎక్కువగా సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాల విషయంలో దృష్టి పెట్టడం చేస్తున్నాడట.అందుకే ఇప్పటికే ఫిక్స్ అయిన జూన్ లో సినిమా ను విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సోషల్‌ మీడియాలో జవాన్‌ సినిమా యొక్క టాక్ తారా స్థాయిలో ఉంది.

అందుకే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని దాంతో ఓపెనింగ్స్ తోనే భారీ వసూళ్లు సాధించాలని షారుఖ్ ఖాన్‌ పీఆర్ టీమ్‌ భావిస్తుందట.ఇక సినిమా యొక్క ప్రతి సన్నివేశం విషయంలో రాజీ పడకుండా అద్భుతంగా వచ్చే లా అట్లీ ప్లాన్‌ చేస్తున్నాడు.కనుక సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.వెయ్యి కోట్ల సినిమా తో వచ్చిన షారుఖ్ ఖాన్ తన తదుపరి సినిమా విషయంలో కాస్త టెన్షన్ గా ఉన్నట్లు అనిపిస్తోంది.

అది ఎక్కడకు దారి తీస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube