రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్( NTR Ram Charan ) హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ చిత్రానికి డివివి నిర్మాతగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడంలో దానయ్య( Danaiah ) పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు( Oscar Award ) అందుకోవడంతో ఇప్పటివరకు ఈ సినిమా అవార్డు వేడుకలలో దానయ్య కనిపించకపోవడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.ఇక ఆస్కార్ వేడుకలలో కూడా ఈయన కనిపించకపోవడంతో ఏదో జరిగింది అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే అవన్నీ అవాస్తవమని తాజాగా దానయ్య ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ ఇండియన్ తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం నిజంగా గర్వించదగ్గ విషయమనే తెలిపారు.ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అందుకు గల కారణం రాజమౌళి( Rajamouli ) ఆయన కృషి కారణంగానే ఈ సినిమాకు అవార్డు వచ్చిందని ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెల్లుతుందని తెలిపారు.2006వ సంవత్సరంలోనే తాను రాజమౌళిని కలిసి సినిమా చేద్దామని చెప్పాను.అయితే ఆయన మర్యాద రామన్న సినిమా చేశారు.కానీ తాను పెద్ద సినిమా చేయాలని చెప్పడంతో తాను రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని తర్వాత చేద్దామని చెప్పారు చెప్పిన విధంగానే ఈ సినిమా చేశారని దానయ్య తెలిపారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని అనుకున్న దానికన్నా అధిక బడ్జెట్ ఖర్చు అయిందని దానయ్య తెలిపారు.ఇక నాటు నాటు పాట ( Natu Natu song )గురించి మాట్లాడుతూ 30 రోజులు రిహార్సల్స్ చేసి 17 రోజులపాటు ఉక్రెయిన్ లో ఈ పాట షూటింగ్ చేశామని దానయ్య తెలిపారు.ఈ పాట కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఆస్కార్ అని తెలిపారు.ఇక ఆస్కార్ అవార్డు వచ్చిన వెంటనే రాజమౌళితో మాట్లాడాలని ప్రయత్నం చేశాను కానీ ఆయన అక్కడ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల తనకు మాట్లాడటం కుదరలేదని ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు విషయంపై దానయ్య స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







