ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్షల్ తో బలవంతంగా బయటకు పంపించారని వాపోయారు.
తన గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు.శాసనసభ నుంచి తనను తాత్కాళికంగా సస్పెండ్ చేశారన్న కోటంరెడ్డి అధికార మదంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ఇటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని చెప్పారు.తనపై జరిగిన ఈ అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.