జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతానికి ప్రజా ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని ,ఇద్దరి ఆశయాలు ,ఆలోచనలు ఒక దారిలోనే ఉన్నాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaidu ) చెప్పుకొచ్చారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…పొత్తుల పై తమ అధినేత ఎన్నికల సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు…ఇప్పటికైతే ఆ ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారని వారి శ్రమకు ఊతాన్నిస్తూ మిగిలిన ప్రజాస్వామ్య వాదులంతా కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఇక మరో టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప( Nimmakayala Chinarajappa ) మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం ఆఖరి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నా ఇప్పటికీ ప్రజలకు మేలు చేసింది ఏమి లేదని ,ప్రజల్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే వచ్చారని విమర్శించారు…తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ 23 మంది ఎమ్మెల్యే ల మద్దతు మాత్రమే కాక వైసీపీ నుండి కూడా ఎమ్మెల్యే లు,నాయకులు టచ్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు….కాబట్టి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధ( Panchumarthi Anuradh ) తప్పక విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు….మొదలవబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

ఎన్నికల హడావిడి మొదలయ్యే సమయం దగ్గర పడుతుండడంతో మొత్తానికి టీడీపీ నాయకులు కేడర్ లో పాత జోష్ తీసుకువచ్చేలా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు… ప్రభుత్వం పై విమర్శల్లో కానీ ,కలిసి వచ్చే ప్రతిపక్షాల తో మసులుకునే వైఖరి లో కానీ ప్రణాళికలు రచించి ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పకనే చెపుతున్నారు….గత ఎన్నికల ఫలితాల కారణం గా తీవ్ర నిరాశకు గురైన పార్టీ శ్రేణులలో కొత్త ఉత్తేజాన్ని నింపి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం లో టిడిపి నాయకత్వం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి…







