పాములు, పిల్లుల( Snakes cats ) మధ్య జరిగిన భీకరమైన పోరు వీడియోలను మనం ఇప్పటికే ఎన్నో చూసాం.అయితే తాజాగా వైర్లు అవుతున్న ఒక వీడియో మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది.
వైరల్ అయిన ఈ వీడియోలో, ఒక పాము పిల్లిని కాటు వేయబోతుంది, అయితే అది పిల్లి ముఖానికి అంగుళాల దూరంలో ఉన్న సమయంలో, పిల్లి వెనక్కి వెళ్లి పామును తన పంజాతో బలంగా కొట్టింది.పిల్లి మిల్లీ సెకండ్లలోని రియాక్ట్ అయ్యి పాము కాటు నుంచి తప్పించుకుంది.
అంతేకాదు అది పాముని ఒక దెబ్బ కూడా వేసింది.దాంతో పాముకి దిమ్మతిరిగింది.
పిల్లి రియాక్షన్ టైమ్ ఎంత వేగంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

నిజానికి పిల్లులు, పాములు రెండూ చాలా వేగంగా రియాక్ట్ అవుతాయి.సగటు పిల్లి రియాక్షన్ టైమ్ 20-70 మిల్లీసెకన్ల మధ్య ఉంటుంది.అయితే సగటు పాము రియాక్షన్ టైమ్ 44-70 మిల్లీసెకన్ల మధ్య ఉంటుంది.
పిల్లుల రిఫ్లెక్షన్స్ అంటే ఆటోమేటిక్ రియాక్షన్స్( Automatic reactions ) చాలా వేగంగా ఉంటాయి.అందుకే వేటాడడంలో పిల్లలకు మించినవి ఏవి లేవని అంటారు.ఇవి ఎలుకలను చాలా వేగంగా పట్టుకుంటాయి.ఇక పాములు కూడా వేగవంతమైన రిఫ్లెక్స్‌లను కలిగి ఉంటాయి.

ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, దీనిని ట్విట్టర్ వేదికగా వియర్డ్ అండ్ టెరిఫైయింగ్ (@Artsandcultr) అనే పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 4 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.ఈ పిల్లి పంచులు విసరడంలో బ్రూస్ లీ కంటే ఫాస్ట్ గా ఉందే అని ఫన్నీగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఈ అద్భుతమైన క్యాట్ వీడియోని మీరు కూడా చూసేయండి.







