అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా అవతరించిన భారత్... మోడీనా మజాకా?

మోడీ ( PM Narendra Modi ) నాయకత్వంలో భారత్ ( India ) వివిధ రంగాల్లో విశేషంగా దూసుకుపోతోంది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా( largest arms importer ) భారత్‌ ఇపుడు అవతరించింది.2013 -17తో పోలిస్తే 2018-22లో ఈ దిగుమతులు దాదాపుగా 11 శాతం మేర తగ్గినప్పటికీ ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఆయుధ దిగుమతుల్లో మళ్లీ మొదటి స్థానంలోనే కొనసాగడం కొసమెరుపు.రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత కావచ్చు, అదేవిధంగా భిన్న సరఫరాదారుల నుంచి ప్రయత్నాలు, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటి వాటి వల్లే ఆయుధ దిగుమతి తగ్గుదలకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 India Emerged As Worlds Largest Arms Importer Details, India, Latest News, Viral-TeluguStop.com

ఈ విషయమై స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన తాజా నివేదికలో ఈ విషయం గురించి వెల్లడించింది.2018-22లో ప్రపంచంలో తొలి 5 ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, ఆస్ట్రేలియా, చైనాలు నిలవడం గమనార్హం.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా నేటికీ కొనసాగడం.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీలు ఉన్నాయి.

కాగా మన పొరుగు దేశం పాకిస్థాన్ ప్రపంచలోనే 8వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉండడం కొసమెరుపు.పాకిస్థాన్ దాదాపుగా చైనా నుంచే యుద్ధ సామాగ్రి కొంటోంది.2018-22లో ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతుల్లో 30 శాతాన్ని భారత్‌ అందుకుంది.దీంతో అమెరికాను తోసి మన దేశానికి రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఫ్రాన్స్‌ నిలిచింది.

కాగా మొదటి స్థానంలో రష్యా ఉంది.అయితే ఆ దేశం నుంచి భారత్‌కు అందుతున్న ఆయుధాలు క్రమంగా తగ్గుతూ ఉండడం గమనార్హం.

అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా ఫ్రాన్స్‌ వాటా ఇపుడు పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube