చట్టాల స్ఫూర్తిని అర్థం చేసుకుని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయా

సఖీ కేంద్రం పనితీరు బాగుంది.సఖీ సేవల ల గురించి విస్తృత ప్రచారం కల్పిస్తూ.

 The Spirit Of The Laws Should Be Understood And Strictly Enforced At The Field L-TeluguStop.com

ప్రజలకు మరింత చేరువ చేయాలి ప్రతి మంగళవారం సఖి కేంద్రంలో వైద్య సేవలు అందేలా చూడాలి మార్చి నెలాఖరులోగా జిల్లాలోని అన్ని పి హెచ్ సి లలో ఫిజియో థెరపీ సేవలు ప్రారంభించాలిసమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకించిన చట్టాల స్ఫూర్తిని అర్థం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ మీటింగ్హల్ నందు సఖి మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సఖి అందిస్తున్నటువంటి సేవలను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం కమిటీ సభ్యులకు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ….

జిల్లాలో సఖి కేంద్రం పని తీరు బాగుందని ప్రశంసించారు.సఖి అందిస్తున్నటువంటి సేవలను మరింత మందికి చేరువయ్యేలా టోల్ ఫ్రీ నెంబర్ 181 ను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

అలాగే 181 టోల్ ఫ్రీ నెంబర్ను జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కళాశాలలు విద్యాసంస్థలు, పని ప్రదేశాలు కార్యాలయాలు, జన సమర్థం ఉండే ప్రదేశాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రచారం గావించాలని సూచించారు.సఖి కేంద్రంలో నాణ్యమైన, మరింత మెరుగైన కౌన్సిలింగ్ సేవలందించడం కోసం డాక్టర్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడానికి ప్రతి మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

అలాగే వయవృద్ధుల సంక్షేమం గురించి నిర్వహణ సమావేశం జరిగింది.దీనిలో భాగంగా తల్లిదండ్రులను వారి పిల్లలు గాని, వారసులు కానీ నిర్లక్ష్యం చేసినట్లయితే, తల్లిదండ్రుల యొక్క ఆస్తిని అనుభవిస్తూ, తల్లిదండ్రుల పట్ల అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వారు రెవెన్యూ డివిజనల్ అధికారి నేతత్వంలోని ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయవచ్చని అలాగే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే అప్పి లైట్ ట్రిబ్యునల్ కి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు.

దీనిలో భాగంగా 14567 టోల్ ఫ్రీ నెంబర్ వయవృద్ధుల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.అలాగే దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని తెలియడం పరచడం జరిగింది.

అలాగే వయవృద్ధుల కోసం నిర్మించిన డేకేర్ సెంటర్ ని వినియోగించుకోవాలని సూచించారు.అలాగే నిరాశ్రయులైన వారికి, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబడిన వారికి, చూసుకోవడానికి ఎవరూ లేనటువంటి వారి కోసం వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా పోలీసు అధికారి అఖిల్ మహజన్ మాట్లాడుతూ….మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకించిన చట్టాల పటిష్ట అమలుకు పోలీస్ శాఖ తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

అనంతరం వృద్ధుల హెల్ప్ లైన్ ప్రచార కర పత్రాలను అధికారులు ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ సత్య ప్రసాద్,రెవెన్యూ డివిజనల్ అధికారులు సిరిసిల్ల శ శ్రీనివాస రావు, వేములవాడ పవన్ కుమార్ , జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజ్యం, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ,డిస్టిక్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్, జిల్లా విద్యాధికారి , జిల్లా పంచాయతీ అధికారి, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి ,జిల్లా సంక్షేమ అధికారి ,సఖి సిబ్బంది, ఓల్డ్ ఏజ్ హోం సిబ్బంది నిర్వహణ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube