రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న భక్తులు తలనీలాలు సమర్పించగా వచ్చే తల వెంట్రుకలు సేకరించే హక్కు కు సంబంధించిన 2023 -2025 రెండు సంవత్సరాలకు గాను టెండర్ ప్రక్రియ నిర్వహించగా 13మంది బహిరంగ వేలం లో పాల్గొనగా సీల్డ్ టెండర్ ద్వారా 6గురు పాల్గొన్నారు .
ఇట్టి టెండర్ దేవస్థానం పాటగా 14 కోట్లు నిర్ణయించగా తెనాలి వాస్తవ్యులు వెంకట సురేష్ ప్రసాదం వారు రూ.8కోట్ల, 67లక్షల,57వెయిల,695 మాత్రమే వచ్చినందున టెండర్ వాయిదా వేయనైనది.ఈ టెండర్ ప్రక్రియ లో ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్, ఏ ఈఓ హరికిషన్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్,సిరిగిరి శ్రీరాములు, రవీందర్ రెడ్డి ,కూరగాయల శ్రీనివాస్ తో పాటుగా ఇండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు.







