సమంత ప్రధాన పాత్రలో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్నటువంటి ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతుంది.ఈ క్రమంలోని ఈ సినిమా ఫస్ట్ కాపీని నటి సమంత(Samantha) చూశారు.
ఈ సినిమా చూసిన అనంతరం సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు.

ఇలా శాకుంతలం(Sakunthalam) ఫస్ట్ కాపీ చూసినటువంటి సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ట్విట్టర్ వేదికగా సమంత దిల్ రాజు నీలిమ గుణ గుణశేఖర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ఫైనల్లీ ఈరోజు సినిమా చూసా దర్శకులు గుణశేఖర్ నా మనసుని దోచేశారు.ఎంత అందమైన సినిమా ఇది.మన గొప్ప ఇతిహాసాలలో ఒకటి చాలా మనోహరంగా జీవం పోసింది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో మంత్రముగ్ధులవుతారని ఈమె తెలియజేశారు.

ఇక పిల్లలందరూ కూడా ఈ మాయ ప్రపంచాన్ని ప్రేమించబోతున్నారంటూ సమంత ఈ సినిమా పై తన రివ్యూ తెలియచేశారు.ఈ అద్భుతమైన ప్రయాణానికి కారణమైన నిర్మాతలు దిల్‌రాజు(Dil Raju), నీలిమ గుణలకు ధన్వవాదాలు.ఈ సినిమా తనకు మనసుకు ఎంతో దగ్గరైనా సినిమా అంటూ సమంత ఈ సందర్భంగా ఈ సినిమాపై తన సంతోషాన్ని తెలియజేస్తూ చేసినటువంటి.ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.







