బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లీకేజీ.
ప్యాకేజీ.నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్.గ్రూప్ -1 ప్రశ్నాపత్రం సైతం లీకైందని బండి సంజయ్ పేర్కొన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారా అని ప్రశ్నించారు.టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పేపర్ల లీక్ పై న్యాయ విచారణ జరపాలన్నారు.లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ప్రగతిభవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని వెల్లడించారు.







