హైదరాబాద్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం జరగనుంది.సర్వీస్ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.
ఈనెల 5న జరిగిన పరీక్ష పేపర్ల లీకేజీపై ప్రధానంగా కమిషన్ చర్చించనుందని సమాచారం.ఈ నేపథ్యంలో పేపర్ ను రద్దు చేయాలా లేక లీక్ పేపర్ అందిన వారిని తొలగించి ముందుకు వెళ్లాలా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.
కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టి ఇద్దరిపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై పలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు.