రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.మేజర్ గ్రామపంచాయతీ అయినా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఎంతవరకు సబవని గ్రామస్తులు అంటున్నారు.
గ్రామంలోని సీసీ కెమెరాలు అన్నిచోట్ల పనిచేసే విధంగా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పురాణావృతం కాకుండా చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నేతలు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.