హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి టీజేఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రయత్నించారు.
ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అనంతరం నిరసనకారులను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.







