హైదరాబాద్‎లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‎లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి టీజేఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రయత్నించారు.

ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అనంతరం నిరసనకారులను అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.