దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఆస్కార్.టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి( Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కి సెలెక్ట్ అవ్వడం ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగిన విషయం తెలిసిందే.
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కూడా ముగియడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే భాస్కర్(Bhaskar) కు నామినేట్ అయితే ఓన్లీ ఆస్కార్ అవార్డు మాత్రమే ఇస్తారా ఇంకా ఏమీ లాభం ఉండదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.ఆస్కార్ వరకూ వెళ్లి ఎవిరీ వన్ విన్స్ అనే పేరుతో లక్ష 26 వేల డాలర్లు విలువ చేసే గిఫ్ట్ బ్యాగ్ ను ఇస్తారట.
ఆ బ్యాగ్ లో కోటి రూపాయలకు పైగా బహుమతులను పెడతారు నిర్వాహకులు.
డైరెక్టర్, యాక్టర్, యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ వీరికి మాత్రమే ఈ లగ్జరీ బహుమతులు పొందే అవకాశం ఉంటుంది.ఎవరైతే ఆస్కార్ నామినేషన్స్(Oscar nominations) లో ఉండి ఆస్కార్ అవార్డు పొందలేదో వారు రూ.1.03 కోట్ల విలువైన లగ్జరీ బహుమతులను అందుకోనున్నారు.ప్రతి ఏటా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండి అవార్డు పొందని వాళ్ళని ఓదార్చడానికి లగ్జరీ బహుమతులను అందిస్తుంటారు.
అలానే విదేశాలకు ఉచిత ట్రిప్ లు వేసుకోండి అని అవకాశం ఇస్తారు. కాస్మెటిక్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటే చేసుకోండి అని డబ్బులు ఇస్తారు.లగ్జరీ ఉత్పత్తులు సహా చాలా ఇస్తారు.ఒక్కో నామినీకి దాదాపు రూ.కోటి రూపాయలు విలువైన గిఫ్ట్ హ్యాంపర్ ను కూడా అందిస్తారు.అయితే 8 మంది నామినీస్ మూడు రాత్రులు ఇటాలియన్ లైట్ హౌజ్ లో గడిపే అవకాశం ఇస్తున్నారు.
ఇది ఇటలీ తీరంలో ఒక ద్వీపంలో కొండ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ప్లేస్.

ఇక్కడ నామినీస్ గడిపేందుకు అయ్యే ఖర్చు 9 వేల యూఎస్ డాలర్లు.పూర్తిగా ఆస్కార్ వాళ్ళే పెట్టుకుంటున్నారు.అలానే 40 వేల యూఎస్ డాలర్లు విలువైన లైఫ్ స్టైల్ వోచర్ ని ఇస్తున్నారు.
దాంతో పాటు ఆస్ట్రేలియా లోని మంచి ఏరియాలో ఒక ప్లాట్ కూడా ఇస్తున్నారు.ఆస్కార్ తీసుకోకుండా వెను తిరిగిన వారికీ ముఖాల్లో ఆనందం నింపడం కోసం 25 వేల యూఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రుసుమును ఇంటి రెనోవేషన్ పనుల కోసం మైసన్ కన్స్ట్రక్షన్ వారి సౌజన్యంతో ఇస్తున్నారు.
అదేవిధంగా ఇక హీరోలు, హీరోయిన్లు, నటులు, నటీమణులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు తమ వయసును తగ్గించుకుని, అందం పెంచుకోవడం కోసం కాస్మొటిక్ట్రీట్మెంట్లు(Cosmetictreatments)చేయించుకునేందుకు కూడా డబ్బులు ఇస్తుంది.

ఒక్కో నామినీకి 41 వేల యూఎస్ డాలర్లు ఇస్తుంది.ఈ డబ్బుతో భుజాల చికిత్స, జుట్టు పునరుద్ధరణ చికిత్స, ముఖానికి శస్త్రచికిత్స వంటివి చేయించుకోవచ్చు.బ్యాగ్ లో ఇమ్యూనిటీ బూస్ట్, సి60 పర్పుల్ పవర్ ఎడిబుల్ మసాజ్ ఆయిల్, బ్లష్ సిల్క్స్ పిల్లో కేసులు, హాని చేయనటువంటి కొబ్బరి నీరు ఉంటాయట.
జ్వరం వచ్చినప్పుడు రోగులకు పెట్టే రొట్టెలు ఈ బ్యాగ్ లో ఉంటాయట.కాకపోతే అవి జపనీస్ మిల్క్ బ్రెడ్లు.18 యూఎస్ డాలర్ల విలువైన జపనీస్ పాల రొట్టెలు, క్లిఫ్ థిన్స్ అనే చాక్లెట్లు, 13.56 డాలర్లు విలువ చేసే 100 క్యాలరీల స్నాక్ బార్ ఈ బ్యాగ్ లో పెట్టారట నిర్వాహకులు.ఈ విధంగా ఆస్కార్ ను కోల్పోయాము అని బాధ పడే వారికి ఇటువంటి కోట్ల రూపాయలు చేసే బహుమతులు ఇస్తూ ఉంటారు.ఒకరకంగా చెప్పాలి అంటే ఆస్కార్ అవార్డు అందుకున్న వారి కంటే అందుకోని వారికే ఎక్కువగా లగ్జరీ లైఫ్ లో పొందవచ్చు అని చెప్పవచ్చు.