Upasana : ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి రిపోర్టర్స్ కి చెప్పిన రామ్ చరణ్.. ఇప్పుడు ఎన్నో నెల అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు హీరో రామ్ చరణ్(Ram Charan).ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిందో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.

 Ram Charan Told Reporters About Upasanas Pregnancy-TeluguStop.com

అప్పటివరకు స్టార్ హీరో గానే ఇండస్ట్రీలో కొనసాగిన చరణ్ కు ఈ సినిమా డబల్ క్రేజ్ అందించింది అని చెప్పాలి.తండ్రి మెగాస్టార్ చిరంజీవి హోదా తో అడుగుపెట్టిన ఈయన తండ్రి లాంటి పేరు సంపాదించుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు.

కెరీర్ ను చిరుత(Chirutha) సినిమాతో ప్రారంభించగా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు.ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో మాత్రం స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

అలా ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించగా అందులో కొన్ని నిరాశపరిచాయి.

అయినా కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు కదిలాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఇప్పుడు పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నాడు.

ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో ఉపాసన ను ప్రేమించి కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.ఇక పెళ్లి తర్వాత కూడా భార్య సపోర్ట్ కూడా బాగా అందుకున్నాడు రామ్ చరణ్.

ఇక ఉపాసన(upasana) కూడా కొణిదెల వారికి తగ్గట్టుగా పేరు తెచ్చుకుంది.ఎక్కడ కూడా తన హోదాను గర్వంగా ఫీల్ అవ్వకుండా మామూలు అమ్మాయిల ప్రవర్తిస్తూ ఉంటుంది ఉపాసన.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటే హెల్త్ టిప్స్ బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా తన వంతు సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటుంది.ఇప్పటివరకు నెగిటివిటీని ఎదుర్కోలేదు ఉపాసన.ఇక పెళ్లై పదేళ్లు కాగా ఆ మధ్యనే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేశాడు.ఇక ఉపాసన ఈ మధ్య బాగా ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఉపాసన కూడా రామ్ చరణ్ తో ఆస్కార్ అవార్డు(Oscar Award) అందుకోవడానికి వెళ్ళింది.

ఆ అవార్డు అందుకున్న సందర్భంగా రామ్ చరణ్ మీడియా సమావేశంలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు.అయితే ఓ ఇద్దరు రిపోర్టర్స్ వచ్చి ఉపాసనతో ఆస్కార్ అవార్డు అందినందుకు ఎలా ఫీలవుతున్నారు అని ప్రశ్నించడంతో ఉపాసన అసలు నమ్మలేకపోతున్నాను అని తెలిపింది.

అదే సమయంలో పక్కనున్న రాంచరణ్ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని.ఆరవ నెల అని చెప్పటంతో ఆ ఇద్దరు రిపోర్టర్స్ ఆనందంగా ఆశ్చర్యపోయారు.ఇక దానికి సంబంధించిన వీడియో ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.అంతేకాకుండా లక్కీ బేబీ అంటూ కమింగ్ సూన్ అని షేర్ చేసుకుంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/upasanakaminenikonidela/3057704797570393967?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube